ఆర్టీసీలో ఉద్యోగం చాలా.. శ్రమతో కూడుకున్నది. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
దేవరకొండ మే 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ ఆర్టీసీ ఉద్యోగి ఆర్. యస్. రావు నిర్మల ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై,ఆర్. యాస్.రావు నిర్మల కి శాలువాతో సత్కరించి, హార్థిక శుభాకాంక్షలు తెలియ జేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి ఉద్యోగి విధుల్లో చేరిన నాటి నుండి సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే ప్రతి ఉద్యోగికి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని,పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని పేర్కొన్నారు.
టీజీఎస్ఆర్టిసిలో గత 35 ఏళ్లుగా పని చేసి, ఇలాంటి మచ్చ లేకుండా ఎంతో పని ఒత్తిడీతో విధులు నిర్వర్తించిన ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం గొప్ప విషయం అని అన్నారు.
తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్దతో పనిచేశారని,తోటి సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించారన్నారు.
ప్రజలను సురక్షితంగా గమ్యాలకు
చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక పనిచేస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, PACs చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్,పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు,ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


