Singareni : యాజమాన్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

TRINETHRAM NEWS

సింగరేణి విశ్రాంత ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యంతో నిరంతర విజ్ఞప్తులు సంప్రదింపుల ఫలితంగా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాదులో సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని , సింగరేణి లో పనిచేస్తున్న మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని తొందరగా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్రాసిన వినతి పత్రం కాపీని సింగరేణి చైర్మన్ కార్యాలయంలో అందజేయడం జరిగిందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు ,ప్రధాన కార్యదర్శి బుపెల్లి బానయ్య, ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్ లు పేర్కొన్నారు.

యాజమాన్యం వీలైనంత తొందరగా హైదరాబాద్ లో సింగరేణి చే కార్పొరేట్ హాస్పిటల్ ను ప్రారంభించి కార్మికులకు వైద్య సేవలు అందించాలని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.విజయబాబు, నర్సింగరావు, బంగారి రాజయ్య టి.ఉమాకర్, కనకయ్య బీరయ్య లక్ష్మీనారాయణ తదితరులు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Welcoming the management's decision

You cannot copy content of this page

Scroll to Top