Pending Bills : పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో స్పష్టత ఏది

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: సర్పంచుల సంగం నాయకులు కె.రాజిరెడ్డి పరిగి కీ ఎన్ని వచ్చాయో ప్రకటన చేయండి. సీఎం కు వినతి పత్రం ఇద్దమంటే పోలీసులు అడ్డుకుంటున్నారు దోమ..
గ్రామపంచాయతీ లకు 153 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏ గ్రామపంచాయతీ చెల్లించారు ఏ పనికి చెల్లించారో ఇప్పటికి స్పష్టత లేదని దోమ మండల సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి ఆరోపించారు మంగళవారం రాష్ట్ర సర్పంచుల ఐకాస ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం ఇద్దామని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయిస్తే రాత్రి కీ రాత్రే జిల్లాల్లో ముఖ్య నాయకులను పోలీసులు ప్రివెంట్ అరెస్టులు చేస్తున్నారు ఇదేం పద్దతి అని ఆవేదన వ్యక్త పరిచారు రాష్ట్ర వ్యాప్తంగా 12600 పై చిలుకు గ్రామపంచాయతీ లకు దాదాపు వెయ్యి కోట్ల నుండి పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని శాసన సభ సాక్షిగా ప్రభుత్వ పెద్దలే వెల్లడించారు మొన్న విడుదల చేసిన 153 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఏ గ్రామపంచాయతీ కీ వచ్చాయో వారం రోజులు గడుస్తున్న కనీసం దివిజినల్ స్టాయి అధికారులకు కూడా సమాచారం లెదు అప్పుల పాలు అయిన సర్పంచ్లు పెండింగ్ బిల్లులు వచ్చాయా అని మండల కార్యాలయాలకు కాల్స్ చేస్తే మనకు ఇప్పటి వరకు ఎలాంటి బిల్లులు రాలేదు అని సమాధానం వస్తుంది దాదాపు పది వేల పనులకు సంబందించిన బిల్లులు చెల్లించాం అనిప్రభుత్వం నుండి ప్రకటన వెలువడిన నేటికీ కూడా పరిగి నియోజకవర్గం కానీ వికారాబాద్ జిల్లాకి గాని ఒక్క రూపాయి పెండింగ్ బిల్లులు రాలేదు ఒక వేల వస్తే జిల్లాకు మండలాలకు ఎన్ని వచ్చాయో అధికారులు చెప్పాలని రాజిరెడ్డి అధికారులను కోరుతున్నారు. ఈ విషయం పై జిల్లాకు ఒకరి చొప్పున మాజీ సర్పంచ్లు వెళ్లి సీఎం కు విన్నవిద్దామంటే పోలీసులేమో సమాచారం తెలుసుకొని అర్ధ రాత్రే తలుపులు కొడుతున్నారు ప్రభుత్వ పెద్దలు ఈ పెండింగ్ బిల్లుల విషయం లో జోక్యం చేసుకోవాలని రాజిరెడ్డి విజ్ఞప్తి చేసారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

What is the clarity

You cannot copy content of this page

Scroll to Top