కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 25 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, రాజు గౌడ్, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


