TRINETHRAM NEWS

Trinethram News : 16.01.2024

చంద్రబాబుపై మోపినవి నిరాధార ఆరోపణలు

  • మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

చంద్రబాబుపై మోపబడినవి నిరాధార ఆరోపణలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కాన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం…

చంద్రబాబుపై సాక్ష్యాలు లేకుండా కేసు పెట్టడం జరిగింది. చంద్రబాబు, టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అందులో భాగమే చంద్రబాబునాయుడుపై కేసు. వచ్చే రోజులు వైసీపీకి గడ్డుకాలమే అని వారు గుర్తించాలి. భవిష్యత్తులో టీడీపీకి తప్పక న్యాయం జరుగుతుంది. టీడీపీ శ్రేణులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఏఏజీ తాను ఛీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నారు. ఆయన ఆటలు ఎంతో కాలం సాగవు. ఏఏజీ వైసీపీ కార్యకర్తలా వ్యవహరించడం మానుకోవాలి. నీలి మీడియా చంద్రబాబు కేసు విషయంలో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా చూపిస్తోంది. అంతగా చిలువలు, వలువలు చేసి చూపించాల్సిన అవసరంలేదు. చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేశారు. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టాలని, పక్కదారి పట్టించాలని చేసిన ప్రయత్నమే. పాక్షికంగా మా నాయకుడికి విజయం దక్కిందనడంలో సందేహం లేదు. చంద్రబాబుపై అక్రమ కేసులు అడ్డగోలుగా బనాయించారు. 17ఏ వర్తిస్తుందని మేం కోర్టుకెళ్లాం. అక్కడ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు సీజె వద్దకు కేసు వెళ్తోంది. సీజే తీసుకునే నిర్ణయం చూడాలి. ఆయన త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేస్తారా? లేక ఐదుగురితో ధర్మాసనం ఏర్పాటు చేస్తారా, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తారో ఏం చేస్తారనేది తరువాత తేలుతుంది. ఇప్పటివరకైతే ఏమీ లేదు. అడ్డగోలుగా, అక్రమంగా బనాయించిన ఇతర కేసులపై కూడా మేం యాంటిసిపేటర్ బెయిల్ కు వెళ్లాం. హైకోర్టు జడ్జీలు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కామెంట్లు కూడా చేశారు. చంద్రబాబును అనవసరంగా ఇరికించారని ప్రజలకు అర్థమైంది. లీగల్ గా జడ్జిమెంట్ కాపీలు వచ్చాక పార్టీ లీగల్ అడ్వయిజరీ కమిటి ఆ జడ్జిమెంట్ కాపీలను స్టడీ చేశాక మా ఒపీనియన్ ను చెబుతాం, అప్పుడు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ పై స్పందిస్తామని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు.