జూన్ 26, 2026
TRINETHRAM NEWS

హైదరాబాద్ మే-23:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీటి బాలరాజు చెల్లె ఉమా రామగుండం శాసనసభ్యులు ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ పరామర్శించారు
ఉమా ఇటీవల మోకాళ్ల నొప్పితో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తక్షణమే హాస్పిటల్‌కు చేరుకొని ఉమా ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో కలిసి పరిశీలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో సంబంధిత వైద్యులతో మాట్లాడి అవసరమైన సూచనలు అందించారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, “ఉమా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీ సీనియర్ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి బాలరాజు, మోహిత్ సన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బి నరేందర్, శరత్ బాబు, రాజ్ కుమార్, చిరుగు సాయి తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress party MLA Raj

You cannot copy content of this page