రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రామగుండం పోలీస్ కమీషనరేట్ గోదావరిఖని పట్టణం లోని సింగరేణి బి గెస్ట్ హౌస్ వద్ద గల మూల మలుపు పాయింట్ వద్ద తరుచు ప్రమాదాలు జరుగడం వలన వాహనాల దారులు ప్రాణాలు కోల్పోవడం, గాయల పాలుకావడం,వాహనాలు దెబ్బతినడం జరుగుతుంది కావున రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు మరియు రామగుండం ఎ మ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆలోచనల ప్రకారం ప్రమాదాల నివారణ ప్రజల వాహనదారుల రక్షణ, సురక్షితంగా వారి వారి గమ్య స్థానాలకు చేరేలాగా చేయడం లో భాగంగా మూల మలుపు వద్ద చేయవలసిన మార్పులు, మరమ్మాత్తులు, నిర్మాణం ల గురించి గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, హృక్ మరియు ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి ఒక నివేదిక ఉన్నత అధికారులకు ఇవ్వడం జరుగుతుంది అని ఏసీపీ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


