త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. దమ్మపేట,ములకలపల్లి మండలాల్లో పర్యటించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ… ముందుగా దమ్మపేట మండలం పూసుకుంట కట్కూరు గిరిజన గ్రామాలను బాహ్య ప్రపంచానికి అనుసంధానం చేయడం కోసం ముమ్మరంగా జరుగుతున్న బీటీ రహదారి పనులు పరిశీలించారు. అనంతరం ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో సురభి వారి వివాహ వేడుకలలో మరియు ములకలపల్లిలో చిట్టిబొమ్మ వారి వివాహ వేడుకలలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
అనంతరం వారి చేతులతో షన్మి శ్రీ మెడికల్&జిరాక్స్ నూతన షాప్ ప్రారంభించారు. దమ్మపేట మండలం బాలరాజుగూడెం గ్రామంలో ఎమ్మెల్యే మిత్రులు కల్లూరి వెంకటేశ్వర్లు ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


