MLA Jare : ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే జారె సమీక్ష

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. ఈ నెల 10వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఈ గ్రామంలో పోడుభూములకు పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇందిర గిరి సౌర వికాసం అనే నూతన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా సోలార్ పంప్ సెట్లు బోర్లు మోటార్లు పంపిణీ చేయనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా పర్యవేక్షించారు. పర్యటనలో భాగంగా బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని సందర్శించి ముఖ్య అధికారులతో మరియు పోలీస్ శాఖతో సమీక్ష నిర్వహించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA reviews arrangements for

You cannot copy content of this page

Scroll to Top