Grade-5 Secretaries : కడియంలో ఆరుగురికి గ్రేడ్-5 కార్యదర్శులుగా పదోన్నతి

TRINETHRAM NEWS

కడియం: త్రినేత్రం న్యూస్. కడియం మండలంలో ఆరుగురు సచివాలయ గ్రేడ్-6 కార్యదర్శులు (డిజిటల్ అసిస్టెంట్) లకు గ్రేడ్ 5 కార్యదర్శులుగా పదోన్నతి లభించింది.ఇటీవలి ఈ మండలం నుంచి నలుగురు గ్రేడ్-5 కార్యదర్శిలు గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శిలుగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆరుగురు గ్రేడ్-6 కార్యదర్శులను గ్రేడ్ -5 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ మేరకు మురమండ-1 సచివాలయ నుంచి మర్రి కాశీ విశ్వనాథ్, కడియపులంక -1,2,3 సచివాలయాల నుంచి దూడల రాఘవ, ఆకుల జగదీష్, గూడాల సుబ్రహ్మణ్యం,వేమగిరి 1 నుంచి కె. ప్రతాప్ రాజు,దుళ్ల 2 నుంచి చింతా యమున లకు పదోన్నతి లభించింది. వీరందరికీ ఈనెల 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కౌన్సిలింగ్ ద్వారా స్థానాలను కేటాయిస్తారు. పదోన్నతి పొందిన వీరిని కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, ఎంపీడీవో కె. రమేష్,మండల పరిషత్ ఏవో సుబ్బారావు,సీనియర్ అసిస్టెంట్ దాస్ తదితరులు అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Six promoted to Grade-5 S

You cannot copy content of this page

Scroll to Top