MLA Adireddy Srinivas : డబుల్ ఇంజన్ సర్కారులో‌ శరవేగంగా అభివృద్ధి

TRINETHRAM NEWS

బలహీన వర్గాలు నివసించేచోట పనులు చేపడుతున్నాం

అధికారుల నిర్లక్ష్యం

శాఖల మధ్య సమన్వయం లోపం కనిపిస్తోంది

అధికారులు పాత వాసనలు వదులుకోవాలి

రివర్ ఫ్రంట్ తో గోదావరి గట్టున ప్రముఖుల విగ్రహాలకు మరింత శోభ

ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

కూటమి పాలనలో నగరంలో అంతటా అభివృద్ధి

ఎమ్మెల్సీ సోము వీర్రాజు

9,10 వార్డుల్లో రూ.కోటి 32 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన
Trinethram News : రాజమహేంద్రవరం : డబుల్ ఇంజన్ సర్కారులో‌ శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. 9వ వార్డు ఐఎంఎ హాలు వీధిలో, 10వ వార్డు గాదాలమ్మ నగర్ సాయిధనుష్ అపార్ట్మెంట్ వీధి, లోలుగు నగర్ పార్కు వీధిలో రూ. కోటి 32 లక్షల విలువ చేసే సీసీ రోడ్లు పనులకు సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని,రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జెఎన్ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేక పోయినా డివైడర్లు, ఫుట్ పాత్ లు నిర్మించారని బీసీలు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.-కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో తాము మార్పు చేసి చూపించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తారకరామ నగర్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పర్యవేక్షించారని అన్నారు. గతానికి, ఇప్పటికీ జరిగిన తేడా ప్రజలు గమనించాలని కోరారు. ఇక్కడ ఒక రోడ్డు కోసం తొమ్మిదేళ్లుగా ప్రజలు అర్జీలు పెడుతున్నా వైసీపీ నాయకులు రోడ్డు వేయలేదని తాము ఇప్పుడు ఆ లోటు తీర్చుతున్నామని ఆయన చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం, శాఖలమధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని, అధికారులు పాత వాసనలు వదులుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హితవు పలికారు.

రాజమండ్రి నగర ప్రజల 15 ఏళ్ళ కల సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభిస్తున్నామని, అక్కడ ఉన్న ప్రముఖుల విగ్రహాలకు మరింత శోభ చేకూర్చే విధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజమండ్రిలో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ పని చేస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలు గుర్తించడంతో పాటు ‌మరలా సమస్య తలెత్తకుండా ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి పనులు చేసుకు వెళుతున్నారని, రోడ్లు కాలువలు నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. గాదాలమ్మ నగర్ లో కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టారని, భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కల్పిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rapid development in the

You cannot copy content of this page

Scroll to Top