Free Medical Treatment : తేనెటీగల దాడికి గురైన ఉపాధి కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి ఉచిత వైద్యం అందించాలి

TRINETHRAM NEWS

పోలవరం నియోజకవర్గం ( త్రినేత్రం న్యూస్) ఇంచార్జ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుకునూర్ మండలం : తేనెటీగల దాడికి గురైన ఉపాధి కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉచిత వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై నాగేంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం నాడు దాచారం పంచాయతీ నెమలిపేట గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశంలో 10 కుటుంబాలపై తేనెటీగలు దాడి చేయడం జరిగిందన్నారు. తేనెటీగ దాడిలో క్షతగాత్రులైన ఉపాధి కూలీలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండల నాయకులు వై నాగేంద్రరావు బృందం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ రెక్కాడితేనే డొక్కలు నిండే ఉపాధి కూలీలకు మరో కష్టం ఎదురెందన్నారు.

కూలీలు ఉపాధి పని చేస్తుండగా తేనెటీగల దాడిలో సుమారు 10 కుటుంబాలు పైగా క్షతగాత్రులు అయ్యారని తెలిపారు. అత్యవసర వైద్య నిమిత్తం కుక్కునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న ఇది సరిపోదని అన్నారు. తీవ్ర గాయాలు పాలైన బాధితులను కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఉచితంగా వైద్యం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. గాయాలైన కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గాయాలైన వారిలో కంటి పల్లి శిరీష, కుమారి,పట్ల దుర్గమ్మ, కారం రామారావు కారం భద్రమ్మ, సీత, కౌలూరి శిరీష తదితరులు ఉన్నారన్నారు. వీరికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The government should support

You cannot copy content of this page

Scroll to Top