అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 2 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ప్రజాసంఘాల పిలుపుమేరకు మే 2న నిర్వహించే ‘చలో ఐటిడీఏ పాడేరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులకే అందేలా జీవో నెం. 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసి స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆర్డినెన్స్ విడుదల చేయాలని కోరారు.
గిరిజన నిరుద్యోగ యువత, వైసీపీ శ్రేణులు, పార్టీలకతీతంగా ఆదివాసులంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని ఐటిడీఏ కార్యాలయాన్ని దిగ్బంధించేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో జీవో నెం. 3ను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తన మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ అరకు నియోజకవర్గం సోషల్ మీడియా ఇంచార్జ్ కె. రమేశ్ (రామ్), ప్రతినిధి పాంగి నరసింగరావు, డుంబ్రిగూడ మండల వైస్ ప్రెసిడెంట్ పొట్టంగి రంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


