ICDS Staff : పోషణ లోపంగురవుతున్న చిన్నారులను గుర్తించిన ఐసిడిఎస్ సిబ్బంది

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) ఏప్రిల్30 దేవరకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని, డిండి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 0 నుండి 5 సంవత్సరాల చిన్నారులను గడ్డమీద తండా అంగన్వాడి కేంద్రంలో మరియు గోనకోల్ అంగన్వాడి కేంద్రంలో సెక్టార్ సూపర్వైజర్ మాదిరెడ్డి రేణుక రెడ్డి మరియు ఇతర సూపర్వైజర్లైన చిట్టెమ్మ, విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ మంగమ్మ ,సత్యవాణి, చంద్రకళ ,పద్మ ,భవాని, మణెమ్మ ,లావణ్య ,చంద్రకళ, సంధ్య తదితరులు కలిసి ప్రతి ఒక్క చిన్నారులను వయసుకు తగ్గ ఎత్తు ,వయసుకు తగ్గ బరువు ,మరియు జబ్బ చుట్టుకొలతలు చూసి లోప పోషణకు గురవుతున్న చిన్నారులను గుర్తించడం జరిగినది. వీరికి తగిన వైద్య సేవలు అందించి ఫీడింగ్ బాలామృతం ప్లస్ ఇవ్వడం జరుగుతుంది. అతి తీవ్ర లోప పోషణకు గురి అయిన వారిని జిల్లాలోని ఎన్ ఆర్ సి కి పంపించి ,వారికి మెరుగైన ఆరోగ్య సేవ లు అందించడం జరుగుతుందని తల్లులకు వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ICDS staff identified children

You cannot copy content of this page

Scroll to Top