ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు ప్రగాఢ సంతాపం
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం: త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 27: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనపై జనసేన పార్టీ పాడేరు నాయకులు, వీరమహిళలు కన్నీటి నివాళి అర్పించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గం ఓల్డ్ బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్ సమీపంలో కొవ్వొత్తి ర్యాలీ, మానవహార కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని జనసేన పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య నేతృత్వంలో నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన భారతీయులకు మౌనంగా నివాళి అర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఉగ్రవాదాన్ని ఖండిస్తూ “నశించాలి నశించాలి ఉగ్రవాద చర్యలు”, “ఖబడ్దార్ ఖబడ్దార్ పాకిస్తాన్ ఖబడ్దార్”, “భారత్ మాతాకీ జై” నినాదాలతో వాతావరణం మార్మోగింది.
ఈ సందర్భంగా వంపూరు గంగులయ్య మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దుర్మార్గమైన దాడికి ప్రతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కచ్చితంగా బదులు చెబుతారని, యావత్ భారతదేశం కేంద్ర ప్రభుత్వ వెన్నంటి ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారని, మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, ఐటీ ఇంచార్జ్ సాలేబు అశోక్, ఐటీ కోఆర్డినేటర్ సీ.హెచ్. అనిల్ కుమార్, పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నాగేష్, మండల సీనియర్ నాయకులు పాంగీ శివాజీ, పాడేరు మండల అధ్యక్షుడు నందోలి మురళీ కృష్ణ, జి. మాడుగుల మండల అధ్యక్షుడు మాసాడి భీమన్న, ఉపాధ్యక్షులు సీసాలి భూపాల్, సీనియర్ నాయకులు వెంకట్, పాంగీ సోములు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంపూరు సురేష్, మండల నాయకులు కుంచె దేవేంద్ర ప్రసాద్, లంకేలా పవన్, మాదేల నాగేశ్వరరావు, ఏస్ సోమరాజు, బాలన్న, తాతరావు, వార్డు మెంబర్ దుడ్డు సాయికుమార్, అప్పలరాజు బీరం, నాయకులు తల్లే త్రిమూర్తులు, మజ్జి సత్యనారాయణ, అప్పలరాజు, ఉలం ఈశ్వరరావు, కె. సూరిబాబు, ఏం. సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


