వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశము హాలు లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో భూ భారతి రైతు అవగాహనా కార్యక్రమాలు ఉండడంతో ఈ నెల 28న జరగాల్సిన ప్రజావాణిని వాయిదా వేశామని అన్నారు. తదుపరి మే నెల 5వ తేదీ నుంచి తిరిగి యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతుందని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, కలెక్టరెట్ కార్యాలయానికి ప్రజలు ఎవ్వరు కూడా రాకూడదని కలెక్టర్ కోరార
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


