MLA Adireddy Srinivas : ఉగ్రవాద పిరికి పంద చర్యకు బలమైన ప్రతి చర్య ఉంటుంది

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

కాశ్మీర్‌లోని పహల్గాం ఘటనను ఖండిస్తూ కొవ్వోత్తులతో శాంతి ర్యాలీ
Trinethram News : రాజమహేంద్రవరం :జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గాం ప్రాంతంలో భారతీయులపై పాకిస్తాన్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో భారతీయులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ స్థానిక రామాలయం సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ శెట్టిబలిజ సంక్షేమ ` అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాల రాయుడు, కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, టిఎన్‌టియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్‌, రాజమండ్రి పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్‌ తదితరులతో కలిసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విశాఖ జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కాశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన ఆయనపై ఉగ్రవాదులు దాడి చేసి హత మార్చడం ఆ కుటుంబానికి తీరని లోటని, అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్‌ రావు అనే సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ ను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో 28 మంది భారతీయులు మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో వర్ణించడం చాలా కష్టమన్నారు. భగవంతుడు వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవడానికి బలాన్ని చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్ర దాడికి బలమైన ప్రతి చర్య తీసుకుంటుందన్నారు. ఎలాంటి చర్యలు ఉంటాయంటే భవిష్యత్తులో ఏ ఉగ్రవాది కూడా ఇలాంటి దాడికి పాల్పడాలంటే భయపడేటువంటి చర్యలు ఉంటాయన్నారు. కాశ్మీర్‌ ను టూరిజం హబ్‌ గా తీర్చిదిద్దాలని ఎన్డీఏ ఆర్టికల్‌ 370 ని రద్దు చేసిందని గుర్తు చేశారు. అలాగే కాశ్మీర్‌ ను టూరిజం హాబ్‌ గా తీర్చిదిద్దాలనే ఎన్డీఏ కలను చదరగొట్టడానికే ఉగ్ర ముస్కరమూకలు ఈ దాడులకు పాల్పడుతున్నారన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు తో యదేచ్చగా దేశ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి కాశ్మీర్‌ ను సందర్శిస్తున్నారని ప్రజల సందర్శన పెరిగితే కాశ్మీర్‌ ను వచపర్చుకోవాలనే పాకిస్తాన్‌ ఆటలు సాగవని విహార యాత్ర చేసే వారే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ఈ దాడిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోదన్నారు. దేశ ప్రజలందరూ మేము భారతీయులమని గర్వంగా చెప్పుకునేలా ఎన్‌డీఏ ప్రభుత్వం ఉగ్రవాదులకు బుద్ధి చెబుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

strong response to the cowardly act

You cannot copy content of this page

Scroll to Top