Pawan Kalyan : 1.20 కోట్ల ఉపాధి కూలీలకు ప్రమాదబీమా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం

TRINETHRAM NEWS

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు.

కూలీల వివరాలతో ఫీల్డ్ అసిస్టెంట్లు బ్యాంకులో నమోదు చేయించాలి.

Trinethram News : రాష్ట్రం లోని ఉపాధి కూలీలందరికీ ప్రమాదబీమా చేయించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇటీవల మొగల్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి కూలీలు చనిపోయినప్పుడు వారికి బీమా లేకపోవడంతో ఆ కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సాయం అందని పరిస్థితి ఏర్పడింది.

అలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే 1.20 కోట్ల మంది ఉపాధి కూలీలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. ఆ మేరకు పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజకు ఆదేశాలి చ్చారు.

మే 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని బ్యాంకుల్లో నమోదు చేయించేలా ఫీల్డ్ అసిస్టెంట్లను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో కమిషనర్ సోమవారం అన్ని జిల్లాల డ్వామా పీడీలతో మాట్లాడారు.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రీమియం ఒక వ్యక్తికి రూ.20 చెల్లిస్తే చాలు ఆ వ్యక్తి ప్రమాదంలో చనిపోయిన ప్పుడు రూ.2 లక్షల బీమా లభిస్తుంది. అదే విధంగా రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కింద రూ.450 ప్రీమియం చెల్లిస్తే పలు రకాల ప్రమాదాలకు బీమా లభిస్తుంది.

ఈ రెండు పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలను నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. మే 1వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి సంతకాలు తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లు బ్యాంకుల వద్ద నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు కసరత్తు చేసి జూన్ లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ప్రతి ఉపాధి కుటుంబానికి భరోసా కల్పించాలని నిర్ణయించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Accident insurance for 1.20 crore

You cannot copy content of this page

Scroll to Top