తేదీ : 19/04/2025. కృష్ణ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజకవర్గం లో విద్యాశాఖ మరియు సర్వ శిక్ష జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరతలు కలిగిన విద్యార్థులకు గుడివాడ ఏ జీకే పాఠశాలలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి పట్టణ అధ్యక్షులు దింట్యాల. రాంబాబు, నాయకులు, వెని గండ్ల. రాము, కృష్ణ సంబంధిత అధికారులతో కలిసి విద్యార్థులకు ట్రై సైకిల్స్ మరియు ఉపకరణాలు అందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలని సంకల్పంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. విద్య వ్యవస్థలో వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు , అధికారులు యం ఈ వో బాలాజీ, ఏ బి కే పాఠశాల ప్రిన్సిపాల్ నరసమాంబ సర్వ శిక్ష అభియాన్ అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


