Retirement Age : ఔట్సోర్సింగ్ కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి

TRINETHRAM NEWS

స్కావెంజర్స్ ను ప్రభుత్వం సన్మానిస్తూ వారికి రిటైన్మెంట్ బెనిఫిట్స్ అన్ని వర్తింప చేయాలి.

త్రినేత్రం న్యూస్ ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…. సామర్లకోట,ఏప్రిల్,17: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘ సామర్లకోట కమిటీ ప్రధాన కార్యదర్శి కశిం కోట కిషోర్ అధ్యక్షతన స్థానిక సామర్లకోట పురపాలక సంఘం ఎదుట పురపాలక పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం ఉదయం నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పట్టణ ఏఐటియుసి నాయకులు పెద్ది రెడ్ల సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ హాజరయ్యారు. తోకల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ రిటైర్మెంట్ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.

ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే వర్తింప చేయాలని, రిటైర్మెంట్ పేరుతో కార్మికుల నుండి విధుల నుండి తొలగిస్తున్నారని తొలగించడం వల్ల సిబ్బంది కొరత ఏర్పడుతుందని, జనాభా కనుగొనంగా తగు సిబ్బంది లేనందున పారిశుధ్యం కుంటిబడుతుందని, డిప్యూటేషన్ పేరుతో నియమించిన సిబ్బందిలను ఆఫీసులలో, రాజకీయ నాయకులు ఇంట్లో తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని, దీనివల్ల కార్మికుల కొరత ఏర్పడుతుందని ఈ పని భారాన్ని ఇతర కార్మికులపై మోపి ఇన్స్పెక్టర్లు, మేస్త్రిలు, సచివాల సెక్రటరీలు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని, ఇవి తక్షణమే మానుకోవాలని, డిప్యూటీషన్ పేరున ఉన్న సిబ్బందిచే పాశుద్ధ్య పనులు చేయించడం లేదా జనాభా కనుగొనంగా సిబ్బంది పెంచడం మా ప్రజా ప్రతినిధులు పురపాలక సంఘం పనులు పై దృష్టి సారించాలని పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, స్కావెంజర్స్ ను ప్రభుత్వం ఆధ్వర్యంలో వారిని సన్మానించాలని, వారికి పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని వర్తింపచేయాలని, ప్రభుత్వం చిత్తుచిద్దితో వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రసాద్ అన్నారు.

పెద్దిరెడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు 60 సంవత్సరాల పాటు దుర్భరమైన జీవితాలు గడిపారని, వారి సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం వారిని గుర్తించాలని, ప్రమాదకరమైన కరోనా సమయంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని మరిచిపోవద్దని, వారిని ప్రభుత్వం గుర్తించి వారసత్వపు పనులు అప్పగించాలని, రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పారిశుధ్య కార్మికుల పట్ల రాజకీయ కక్ష సాధింపు వేధింపులు కార్మికుల పట్ల మానుకోవాలని ఆయన అన్నారు. కామిరెడ్డి బోడకొండ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తికాకుండానే కార్మికులపై వేటు ప్రారంభించిందని ఆయన మండిపడ్డారు.

పారిశుధ్య కార్మికులపై ఈ ప్రభావం చూపిస్తున్నారని, ఔట్సోర్సింగ్ కార్మికులను రిటైర్మెంట్ పేరుతో విధుల నుండి తొలగిస్తూ వారిని ఇంటికిపంపే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు, కార్మికులు ఎన్నుకున్నందుకు ప్రభుత్వము వంకర బుద్ధి బయట పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం పునరఆలోచన చేసి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఆప్కాస్ ఔట్సోర్సింగ్ కార్మికులందర్నీ తక్షణమే పర్మిట్ చేయాలని, కార్మిక ఉద్యమాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మేనేజర్ గారికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బొత్స శ్రీను, మల్లిపూడి లక్ష్మి, మిరియాల పెద్ద, చెన్న వెంకటేశ్వర్లు, చిడతా వరలక్ష్మి, కసింకోట ఆనందరావు, సింగంపల్లి అప్పారావు,బంగారు వెంకన్న, తాతపూడి శ్రీనివాసరావు, గుడుపు దుర్గాప్రసాద్ నాగాళ్ల బంగారాజు, చింతల లావరాజు, సింగంపల్లి అనంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Retirement age limit for

You cannot copy content of this page

Scroll to Top