జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 13 at 8.03.26 PM

TRINETHRAM NEWS

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం.

రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో భోగి వేడుకల్లో పాల్గొననున్న ఇరువురు నేతలు

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేస్తూ కార్యక్రమం

అమరావతి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రేపు(14.01.2024) భోగి వేడుకల్లో ఉమ్మడిగా పాల్గొననున్నారు. ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమం పేరిట అమరావతి రాజధాని పరిధి గ్రామమైన మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న భోగి వేడుకల్లో ఉదయం 7 గంటలకు పాల్గొంటారు. జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రతులను భోగి మంటల్లో దహనం చేస్తారు. జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు – పన్నుల బాదుడు, జె.బ్రాండ్స్, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన రైతులతో చంద్రబాబు, పవన్ ముచ్చటిస్తారు.

You cannot copy content of this page