ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Trinethram News : రాజమహేంద్రవరం రూరల్: పేద ప్రజలకు మంచి పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల్లో ప్రజల అభీష్టం మేరకే పరిపాలన అందిస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం కాతేరు గ్రామంలో 1కోటి 37.70 లక్షల రూపాయలతో రెండు వాటర్ ట్యాంక్ లు మరియు 55 లక్షల రూపాయలతో నిర్మించిన సి.సి రోడ్లు అలాగే ఆంధ్ర పేపర్ మిల్ సౌజన్యంతో 20లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన రెండు ట్రాక్టర్లను పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకేష్ జైన్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని, కూటమి ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అన్నారు.
కాతేరు గ్రామానికి ఆంధ్ర పేపర్ మిల్ వారి సహకారం మరువలేనిదని వారి సహకారంతో ఈరోజు పంచాయతీకి 20 లక్షల విలువచేసే రెండు ట్రాక్టర్లు అందించారని, గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మురుగునీరు పోయే కాలువల్లో చెత్త వేయరాదని గ్రామంలో పారిశుద్ధ్య మరింత మెరుగుపడాలని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో ప్రత్యేక ప్రణాళిక చేపట్టడం జరిగిందని దానిలో భాగంగా ఈరోజు 1కోటి 37.7 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు వాటర్ ట్యాంకులను ప్రారంభించామని, మరో 55 లక్షల రూపాయలతో ఐదు కిలోమీటర్లు మేర పైపులైన్ నిర్మాణం జరుగుతుందని, ప్రస్తుతానికి బోర్ వాటర్ ద్వారా నీరు అందించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో శుద్ధిచేసిన గోదావరి నీటిని ప్రతి ఇంటికి అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పటికే గ్రామంలో 3కోట్ల రూపాయలు పనులు పూర్తి చేయడం జరిగిందని, మరొక 7కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశామని, గ్రామంలో మల్లయ్య పేట నుండి పేపర్ మిల్ మీదుగా మెయిన్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, ఆ పని పూర్తి చేసేందుకు పేపర్ మిల్ వారి సహకారం కావాలని, ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారని, రాబోయే పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, ఆర్.డబ్ల్యు.ఎస్ ఈ.ఈ బి.వేంకటగిరి, ఎం.పీ.డీ.వో డి.శ్రీనివాసరావు, డిఈలు రవికుమార్, శ్రీనివాస్ బాబు, గంగిన నాని, బిక్కిన సాంబశివరావు, పేపర్ మిల్లు సంస్థ ప్రతినిధి తాతారావు, ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర, సి.ఎస్.ఓ ఎల్లాజీ రావు, ఏ.ఈ సంపత్ కుమార్, ఈదల మల్లు, దాసరి భూషణం, రాకుర్తి రామచంద్ర నాయుడు, యానాపు యేసు, గంగిన తిరుమల్ రావు, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, సోముల స్వామీజీ, కొల్లి వెంకటరావు, నక్క ఆనంద్, బొబ్బాది దుర్గాప్రసాద్, వేముల చిన్న, మాడ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


