రాజమహేంద్రవరం: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రావ్ వేడుకలను పురస్కరించుకొని రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈరోజు ఉదయం పిడింగొయ్యి పంచాయతీ నందు 20.80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అలాగే కవలగొయ్యి నందు 63 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ మరియు బుచ్చయ్య నగర్ నందు 58.50 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ లను ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, ఈరోజు పిడింగొయ్యి పంచాయతీ నందు ఒక 1కోటి 42.30 లక్షల రూపాయలతో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ రెండు వాటర్ ట్యాంకులను ప్రారంభించుకున్నామని, చాలా సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని దానిలో భాగంగా మనందరికీ అందుబాటులో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించామని, ప్రజలందరూ విధిగా తగు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వెల్నెస్ సెంటర్ చుట్టూ త్వరలో కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని, మరింత సుందరంగా తీర్చి దిద్దుతామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే కవలగొయ్యి, బుచ్చయ్య నగర్ నందు రెండు వాటర్ ట్యాంకులను ప్రారంభించామని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు త్రాగునీరు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి అందిస్తామని తెలిపారు. పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ , రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జీ పద్మావతి, మట్ట శ్రీను, బొప్పన నాగేశ్వరరావు, బొప్పన శ్రీను, కోరాడ వెంకటేష్, కందిరెల్లి సత్తిబాబు, మరుకుర్తి వెంకటేశ్వరరావు, ముప్పిడి రాంబాబు, మార్ని దొరబ్బాయి, వల్లెపల్లి ప్రసాద్ చౌదరీ (బాబుఖాన్) ,ఎడ్ల రామకృష్ణ, కాప శ్రీను, గెడ్డం ప్రభుదాస్,దేవరలంక మంగాయమ్మ, కేదారి, మట్ట నాగబాబు, శివ,లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


