Donating Blood : రక్తదానం మరొకరికి ప్రాణదానం!

TRINETHRAM NEWS

సమైక్య ప్రెస్ క్లబ్ కి అనుసంధానంగా నడుస్తున్న హెల్పింగ్ హాండ్స్ గ్రూప్…!
అత్యవసర సమయంలో రక్తదానం చేసి , ప్రాణం కాపాడిన మల్లాది రాంబాబు …!

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా. తిరువూరు. బోసు బొమ్మ సెంటర్ ఎంవిఎస్ సర్జికల్ (రమేష్ బాబు) హాస్పిటల్ లో తిరువూరు మండలం రోలుపడి గ్రామానికి చెందిన జూపూడి ప్రవల్లిక రక్తహీనత వ్యాధితో (రక్త శాతం మూడు పర్సంటేజ్) బాధపడుతూ చికిత్స పొందుతుంది ఆమెకి అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అవసరం కాగా తిరువూరు హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ మర్సకట్ల కుమార్ (సీనియర్ న్యాయవాది, సమైక్య ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్) ని ఫోన్లో సంప్రదించారు వెంటనే స్పందించిన కుమార్ గ్రూపు సభ్యులైన మల్లాది రాంబాబు కి తెలపగా వెంటనే హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు మద్దిబోయిన నరేష్ (సమైక్య ప్రెస్ క్లబ్ ),ఏలూరి సుజి, న్యాయవాది మర్సకట్ల కుమార్ ,వేల్పుల రాజేష్, తిరువూరు కామెడీ స్టార్ ఫజల్ భాయ్, చిల్లి ముంత రవీంద్రబాబు ,సిరికొండ అభి వరలక్ష్మి (పరిపూర్ణ చారిటబుల్ ట్రస్ట్), ల్యాబ్ టెక్నీషియన్, ఇస్లావత్ అర్జున్ పాల్గొన్నారు…

అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే క్షణాల్లో స్పందించి బ్లడ్ డొనేట్ చేసిన రాంబాబు కి ప్రవల్లిక కుటుంబ సభ్యులు & డాక్టర్ రమేష్ బాబు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Donating blood is donating life

You cannot copy content of this page

Scroll to Top