ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Trinethram News : రాజమహేంద్రవరం : నగరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మళ్ళీ ఎక్కడైనా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.గురువారం 39 వ వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ లను అణచివేశామని, మళ్ళీ వారి గురించి మహిళలు చెబుతున్నారని, పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రోడ్లు, కాలువల గురించి అడగక ముందే వాటిని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు.
లింగం పేట, ఆదెమ్మ దిబ్బ వాంబే గృహాల ప్రాంతంలో మేజర్ డ్రైనేజీ పూర్తవుతోందని ఆయన చెప్పారు. వర్షా కాలంలో ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. లింగంపేట వాంబే గృహాలకు తమ కుటుంబం చేసిన సేవలు ఎవరూ చేయలేదని, మేయరుగా తన తల్లి, ఎమ్మెల్సీగా తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేగా తన సతీమణి ఆదిరెడ్డి భవాని, ఇప్పుడు ఎమ్మెల్యేగా తాను సేవలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన నవ్వుతూ చెప్పారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


