సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్

TRINETHRAM NEWS

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్

కందుకూరు టిక్కెట్ ఖరారు చేసిన జగన్

అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిసి సెల్ జోన్ 5 కన్వీనర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదరుల సహాకార సంఘం యూనియన్ ఛైర్మన్ బొట్ల రామారావు యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు.

కందుకూరు నియోజకవర్గంలో అత్యధికంగా బిసి ఓటర్ల ఉన్న నేపథ్యంలో బిసి అభ్యర్థికి టిక్కెట్ కేటాయింపు చెయ్యాలనే యోచన ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన బొట్ల రామారావు యాదవ్ అభ్యర్థిత్వం అధిష్టానం దృష్టి సారించింది

అందులో భాగంగా సియంఓ నుంచి బొట్లకు పిలుపు రావడంతో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తో భేటీ అయ్యారు

తదుపరి జాబితాలో కందుకూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ తో కందుకూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం

You cannot copy content of this page

Scroll to Top