TRINETHRAM NEWS

పెదపారుపూడి మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు::ఎస్.ఐ నాగ కళ్యాణి *

👉 కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ జాషువా గారి ఆదేశాలతో గుడివాడ డిఎస్పి పి.శ్రీకాంత్ గారి సారధ్యంలో పామర్రు సి.ఐ సుభాకర్ పర్యవేక్షణలో రాబోయే సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఎటువంటి జూద క్రీడలు నిర్వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమైనది …

👉 ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు గానీ, సాంప్రదాయ ముసుగులో జూద క్రీడలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును.

👉 గతంలో జూద క్రీడలు ఆడి కేసులు నమోదైన జూదరులను స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ చేసి ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు పెట్టడమైనది మరియు పోలీసు స్టేషన్ పరిదిలో వున్న సస్పెక్ట్స్,రౌడీలు కౌన్సిలింగ్ చేయడమైనది.

👉 మీ పరిసర ప్రాంతాలలో జూదాలు ఆడే వారి సమాచారం పోలీసు వారికి అందించినచో అట్టి వారి వివరాలు గోప్యంగా వుంచబడును.

👉 జూద క్రీడల సమాచారం పోలీసు వారికి అందించి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరడమైనది.

సాంప్రదాయ క్రీడలు ముద్ద – జూదం జోలికి పోవద్దు .

మీ పెదపారుపూడి ఎస్.ఐ నాగకళ్యాణి