ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 01 12 at 3.40.46 PM

TRINETHRAM NEWS

పరిపూర్ణానంద.. గోగినేని బాబు మధ్య
(నాస్తికునికి, ఆస్తికునికి) సంభాషణ:

నేను జాతకాలు నమ్మను.
అవును అది మీ జాతకంలోనే ఉంది.
నేను దేవుడిని నమ్మను.
తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.

నాకు దేవుడిని చూపించగలరా?
ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.

ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?
మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.

మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?

దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా

దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.

దేవుడిని తలచుకోకపోతే జరగదా?
ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా…

ఇంకేముంది గోగినేని తలవంచుకుంటు వెనుదిరిగారు…..

You cannot copy content of this page