Migration in Villages : గ్రామాల్లో వలసలు పెరుగుతున్నాయి

TRINETHRAM NEWS

Trinethram News : కాకినాడ జిల్లా పలు గ్రామాల్లో బోగస్ మస్టర్ బిల్లులపై దృష్టి పెట్టండి

జిల్లా కలెక్టర్ కు తాటిపాక మధు వినతి
ఉపాధి హామీ పనుల్లో అధికార పార్టీ జోక్యం నివారించండి

యు కొత్తపల్లి, మార్చి 20: ఉపాధి హామీల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని నివారించాలని, గ్రామాల్లో బోగస్ మాస్టర్ బిల్లులపై దృష్టి పెట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు

గురువారం ఉదయం యు కొత్తపల్లి మండలం లో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా వారు బి కె ఎం యు సభ్యత్వం చేర్పించారు

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కొన్ని మెట్ట ప్రాంతాలలో చాలా గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి పట్టణాలకు వలసలు వెళ్లడం జరుగుతోందన్నారు. వ్యవసాయ కూలీలకు జీవించే హక్కును కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ చట్టంను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.
చాలా గ్రామాలలో పనులు దొరకకపోగా బ్రతకడం కోసం అప్పులు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు . ఈ అప్పులు తీర్చడానికి ఉన్న గ్రామాలలో పనులు లేవు. దీంతో జీవనం కోసం ఇతర పక్క రాష్ట్రాలకు వలసల బాట పట్టారన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, వ్యవసాయ కూలీల జీవన పరిస్థితులలో మార్పు రావడం లేదన్నారు.
రాజకీయ జోక్యంతో నిర్వీర్యం అవుతున్నది. పూర్తి స్థాయిలో పనులను కూలీలందరికి కల్పించకపోవడంతో వందల సంఖ్యలో కూలీలు జీవనం కోసం వలసలు పోతున్నారు. గ్రామాలలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి. వలసలు నివారించాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం రూ. 700 ఇవ్వాలన్నారు.
జాబ్ కార్డులో వున్న అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు 200 రోజులు పని దినాలు ఇప్పించాలన్నారు . ఉపాధి హామీలో చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించాలి. జిల్లాలో ఇప్పటికే చేసిన పనికి 4 నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు. ఉపాధి హామీలో రాజకీయ జోక్యాన్ని, ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల ప్రమేయాన్ని నివారించాలన్నారు. ఇప్పటికే గ్రామాలు వదిలి వలసలు వెళ్లిన వారిని తిరిగి గ్రామాలకు రప్పించి ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. ఉపాధి హామీ చట్టంలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది కి ఉద్యోగ భద్రత కల్పించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో తీసివేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందిపై కక్ష సాధింపులు, వేధింపులు నివారించాలన్నారు.
జిల్లాలో అనేక గ్రామాల్లో బోగస్ మస్టర్లు వేసి బిల్లులు చేసుకోవడం జరుగుతోందన్నారు. ఇలాంటి వాటిని అరికట్టాలని సూచించారు

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శాఖ రామకృష్ణ, నక్క శ్రీనివాస రావు, గోవింద్ శ్రీను సత్యవతి పద్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Migration in villages is increasing

You cannot copy content of this page

Scroll to Top