
సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో చెక్ డ్యామ్ మరమ్మత్తు,కొరకు జీరాయితి పట్టాలు మంజూరు కొరకు వినతి పత్రం.
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 19: సీపీఎం ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా అరకువేలి మండలం పెడలబుడు గ్రామంలో చెక్ డ్యామ్ మరమ్మత్తు చేసి పూడిక తీయాలని నువ్వుగుడ లింబగూడ గ్రామాల ఆదివాసి రైతులు సాగు చేస్తున్న భూములకు రీసర్వే చేసి జిరాయితి పట్టాలు మంజూరు చేయాలని పెదలబుడు -1 సచివాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడమైనది.
సీపీఎం జిల్లా మండల నాయకులు పొద్దు బాలదేవ్ కిల్లో జగనాథం మాట్లాడుతూ పెదలబుడు గ్రామంలో వ్యవసాయానికి ప్రధానంగా సాగునీరు అందించే కర్ణగడ్డ నీరునిల్వ చెక్ డ్యామ్ మట్టితో పూడుకుపోయి ఆయకట్టు రక్షణ గోడ కోతకు గురైందని తక్షణమే నీటిపారుదల శాఖ,గ్రామీణా ఉపాధి హామీ అధికారులు స్పందించి రక్షణగోడ మీటరు ఎత్తుపెంచి మరమత్తులు పూడికతీత పనులు చేపట్టాలని ఈ చెక్ డ్యామ్ ద్వారా 100 మంది ఆదివాసీ రైతులు సుమారు 250 ఎకరాలు సాగుచేటున్నారని తెలిపారు.
నువ్వగుడ, లింబగుడ గ్రామాల్లో ముత్తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూములకు 1970 సంవత్సరంలో సెటిల్ మెంట్ హక్కు పత్రాలు ఉన్నాయని సాగు భూములకు జిరాయితీ పట్టాలు ఇస్తామని ఇప్పటికీ రెండుసార్లు ప్రభుత్వ అధికారులు సర్వేలు నిర్వహించి నేటికి పట్టాలు ఇవ్వలేదని స్పేర్ అడంగల్ సర్వేలో రైతుల వివరాలు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారని వెంటనే రీసర్వే నిర్వహించి 35 మంది రైతులకు సాగు చేస్తున్న భూములకు జిరాయితీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు హరి, పెదలబుడు ఆయకట్టు సంఘం నాయకులు సద్దునాయుడు,ప్రసాద్, రాజారావు, నువ్వగుడ లింబగుడ గ్రామస్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
