Bal Mela Program : బాలమేళా కార్యక్రమం

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) మార్చి 13, త్రినేత్రం న్యూస్. ఐ సి డి ఎస్, దేవరకొండ ప్రాజెక్ట్ పరిధిలోని దిండి మండలంలోని వీరబోయినపల్లి గ్రామంలో బుధవారం నాడు బాల మేళా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్టార్ సూపర్వైజర్ రేణుక హాజరే మాట్లాడారు.
అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు ఆటల పాటల ద్వారా విద్యను అందించడం ఒక పూట సంపూర్ణ భోజనం అందించడం, ఆరోగ్య సలహాలు ఇవ్వడం జరుగుతుందని అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.
వీరబోయినపల్లి పాత గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆరు అంగన్వాడి కేంద్రాల్లోని మూడు నుండి ఆరు సంవత్సరాల చిన్నారులకు ప్రీ స్కూల్ విద్య గురించి చెప్పడం జరిగింది.
1983 నుండి వీరబోయినపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేసి ఎన్నో సేవలు అందించిన లక్ష్మమ్మ పదవీ విరమణ సందర్భంలో ఆమెను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు చిన్నారి విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bal Mela program

You cannot copy content of this page

Scroll to Top