Kumar Yadav : దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదు…బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్

TRINETHRAM NEWS

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 11 : హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాంధీనగర్ శివాలయంలోని శివ లింగాన్ని చెప్పు కాళ్లతో తొక్కి హిందు మనోభావాలను విశ్వాసాన్ని దెబ్బ తిసిన దుర్మార్గులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ ను వారి నివాసం వద్ద అక్రమ అరెస్ట్ చేసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్బంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ శివాలయం మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే ధర్నాకు పిలుపునిచ్చిన బీజేవైఎం, బిజెపి నాయకులను అక్రమ అరెస్టులు చేయడం చేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. మత్తు పదార్థాలకు బానిసై మతిస్థిమితం లేకుండా దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీస్ అధికారులు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న ప్రతి దాడిలో ఒక కుట్ర కోణం కనపడుతున్నా కూడా పోలీసులు మత్తు పదార్థాలు, మతిస్థిమితం లేకుండా అని చెప్తూ నిందితులకు వత్తాసు పలకడం బాధాకరమైన విషయం అన్నారు.

శివలింగం మీద చెప్పులతో తొక్కుతూ దొంగతనానికి పాల్పడిన నిందితుల పేర్లను వెంటనే బయటపెట్టాలని అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు తప్పవని పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో బిజెపి నాయకులు మహేందర్, పున్నారెడ్డి, సంతోష్, శివ, రమేష్, రాజు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Attacks on temples

You cannot copy content of this page

Scroll to Top