జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అంతర్గాం మండలం మార్చి-11// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద మహిళ నంది లావణ్య గత కొంతకాలంగా *బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధితో అస్వస్థత కు గురైన నేపథ్యంలో వైద్య సదుపాయ నిమిత్తం ఖర్చులకు డబ్బులు లేక అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న సమయంలో స్థానిక నాయకులు ఉమ్మడి మండలాల కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి ఇట్టి విషయం గురించి తెలియపరచగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్ ఉన్నత వైద్యులతో మాట్లాడి నంది లావణ్య నాణ్యమైన వైద్యం అందజేయాలని మాట్లాడడం జరిగినది.

అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె సుధాకర్, మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం, బరపటి తిరుపతి, ఉప్పులేటి పోచయ్య బ్రెయిన్ సర్జరీ వైద్యానికి అయ్యే ఖర్చుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ద్వారా బ్రెయిన్ సర్జరీకి కావాల్సిన అమౌంట్ నాలుగు లక్షల రూపాయలకు ఎల్ఓసి ని ఇప్పించడం జరిగినది అనారోగ్య బాధితురాలు నంది లావణ్య మాట్లాడుతూ మానవత్వం మూర్తిభవించిన మహోన్నత వ్యక్తి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మనిషి రూపంలో ఉన్న దేవుడు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేయడం జరిగినది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur LoC

You cannot copy content of this page