ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : పివి టీజీలకు జన్ మాన్ ఇల్లుకు పది లక్షలరూపాయలు కేటాయించాలని,సిపిఎం పార్టీ డిమాండ్*
పంది ధూర్లు గ్రామానికి రహదారి, పై అటవీ అధికారుల ఆంక్షలు ఎత్తివేయాలి , అటవీ హక్కుల పట్టాలు, మంచినీళ్లు, రహదారి, మౌలిక సౌకర్యం కల్పించాలి అల్లూరి సీతారామరాజు జిల్లా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి డిమాండ్. ఈ రోజు రాష్ట్రంలో సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి, పాచిపెంట అప్పల నరస పాడేరు మండలం,మోదపల్లి పంచాయతీ అలాగే వంటల మామిడి పంచాయతీ,ఓనూరు గ్రామంలో పర్యటించడం జరిగింది. పంది దూర్లు గ్రామంలో గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఆ గ్రామ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్న ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేపట్టలేదని తెలియజేశారు.
గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకున్న ఆయన ఆ గ్రామంలో తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని, మంచినీటి కోసం అమ్మవారు పాదాలు బ్రిడ్జి వద్ద వారు వెళుతున్నారని, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అలాగే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జన్ మాన్ ఇళ్లకు,రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలరూపాయలు చెల్లిస్తున్నారు.సొమ్ము వారికి ఎటు సరిపోదు. ఆదిమ జాతికి చెందిన గిరిజనులు పట్టణాలలో ఉండరు. వాళ్లు మారుమూల ప్రదేశాల్లో రోడ్డు లేని ప్రదేశాల్లో ఉంటారు. కనుక వారికి ఇస్తున్న రెండు లక్షల 39 వేలు ఇల్లు కట్టే సామాగ్రికే సరిపోదు.అలాగే ఈరోజు ఇసుక రేటు పెరిగింది.ఐరన్ రేటు పెరిగింది.సిమెంట్ బస్తా రేటు పెరిగింది ఈ రేట్లతో ప్రభుత్వం ఇస్తున్న 18/ 20 అడుగుల ఇల్లు పూర్తి కావాలంటే కనీసం 10 లక్షలైనా ఖర్చవుతుంది.
కావున ఒక ఇల్లుకి 10 లక్షలు ఇవ్వాలని,చాలామందికి అటవీ హక్కుల పట్టాలు లేవని, నూతనంగా పెళ్లయిన వారికి రేషన్ కార్డులు తక్షణమే ఇవ్వాలని, పివిటిజలకు వైసిపి హయాంలో అంత్యోదయ కార్డులను రద్దు చేసింది. ఫ్రీ బియ్యం పేరుతో ఆ అంత్యోదయ కార్డులు ఊసే మానేసింది. అర్హులైన వారికి అంత్యోదయ కార్డులు తక్షణమే ఇవ్వాలని, తెలియజేశారు.దీనిపై ఈ నెల 12వ తారీఖున చలో వంటల మామిడి సచివాలయం నిర్వహిస్తున్నామని, అక్కడితో ఆ సమస్య పరిష్కారం కాకపోతే చలో ఎమ్ఆర్ఓ ఆఫీస్, కార్యక్రమం చేపడతామని, అక్కడ సమస్య పరిష్కారం చేయకపోతే చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తామని తెలియజేశారు.
ప్రస్తుతానికి మీకున్న సమస్యలు, వ్యక్తిగత సమస్యలు వ్యక్తిగతంగా దరఖాస్తులు రాసుకుని బుధవారం నాడు జరిగే వంటల మామిడి సచివాలయం కి రావాలని వారందరికీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పాలికి లక్కు, జిల్లా కమిటీ సభ్యులు వంతల దాసు, పాడేరు మండల కార్యదర్శి,ఎం. సుందర్రావు ,జిల్లా నాయకులు, గ్రామస్తులు నాగేశ్వరరావు,చిన్నారావ్ చిన్నయ్య,బాబురావు మహిళలు విజయ,కమల,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


