జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: అల్లూరిసీతా రామరాజుజిల్లా, పాడేరు, అల్లూరి జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక: అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా నాడేలి రామకృష్ణ.

సోమవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు పోతురాస వెంకటరాజు, గౌరవ అధ్యక్షులు డేవిడ్ రాజు, ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, యూనియన్ జర్నలిస్ట్ అధ్యక్షులుగా నాడేలి రామకృష్ణ ,కార్యదర్శిగా వంతల రాజు, కోశాధికారిగా ఎస్. మణిబాబు నూతనంగా నియమితులయ్యారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ, పాత్రికేయులందరికీ ఇల్లు స్థలాలు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, అలాగే చిన్న పేపర్, పెద్ద పేపర్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అక్రిడేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వం కల్పించిన రాయితీలన్నీ అల్లూరి జిల్లా పాత్రికేయులందరికీ, వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో అల్లూరిసంఘం అడ్వైజర్, ప్రేమ్ కుమార్, పి ఆర్ ఓ పి. ఎస్.బాబు,సభ్యులు ధనసాని శివ, గుజ్జేల్ నాగేశ్వరరావు, శోభన్ బాబు,అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alluri Journalist Union

You cannot copy content of this page