రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంఏఐటీయూసీ
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలోని నూతన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ నూతన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకి కేటాయించాలని సింగరేణి సంస్థ మనుగడని కాపాడాలని సత్తుపల్లి oc3, ఇల్లందు oc3, మరియు గతంలో అనుమతినిచ్చిన తాడిచెర్ల గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని వెంటనే ఉత్పత్తిని ప్రారంభించాలని మణుగూరు పీవీక్ 5,
క్టక్ oc,ఇల్లందు oc లలో బొగ్గు తీసే పనులను కాంట్రాక్టర్లతో చేపించాలని యాజమాన్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని సింగరేణి సంస్థ లో పనిచేస్తున్న కార్మికుల ద్వారానే బొగ్గును తీపించాలని కొత్త గనుల కోసం టెండర్లు వేయాలని ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య,డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, వైవి రావు, మడ్డి ఎల్లయ్య, బ్రాంచ్ కార్యదర్శులు ఎస్కే బాజీ సైదా, ఆరేల్లిపోశం, జిగురు రవీందర్, ఎంఆర్సి రెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రొజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


