MLA Bhanu Prakash : మహిళలను గౌరవించే పద్దతి మన సంస్కృతి

TRINETHRAM NEWS

నగరి త్రినేత్రం న్యూస్. భరతమాత, తెలుగు తల్లి అని మహిళలను గౌరవించే పద్దతి మన సంస్కృతిలో ఇమిడి ఉందని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ అన్నారు.

నగరి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినా కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ఈ సందర్భంగా మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భాను మాట్లాడుతూ మహిళలను కూడా సమాజంలో భాగస్వామ్యం చేయడం కోసం, హక్కుదారులని చేయాలనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని తెలిపారు.
ఆడవారు మగవారితో సమానమే నని వారిని అన్నింటిలో బాగస్వామ్యం చేయడం, మన రాష్ట్రంలో నుండి ప్రారంభమయిందని గుర్తుచేశారు.
దేశ చరిత్రలో మహిళలకు ఆర్థిక సావ్వలంభన కోసం డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టి, వారికి సున్నా వడ్డీ బుణాలు ఇస్తున్న ఘనత టీడీపీదేని, చంద్రబాబునాయుడుకే సాధ్యమని తెలిపారు.
మన రాష్ట్రంలో ప్రతి పథకం మహిళలతో ప్రారంభమవుతుందని, టీడీపీ లో మహిళలే కుటుంబ పెద్దలుగా గుర్తించిందని తెలిపారు
నగరి ప్రజలు, ప్రత్యేకంగా మహిళలకు రుణపడి ఉంటానని, ఎన్నికల సమయంలో మహిళలు అండగా ఉంటామని చెప్పారని, వారి అనురాగం మరువలేనిదని గుర్తు చేశారు.
అలాగే అంగన్వాడీలకు గ్రాట్యూటీ అందిస్తున్నాము. నగరి త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా ఇన్చార్జి ఎల్ కే రామన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

culture to respect women

You cannot copy content of this page

Scroll to Top