
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. అసెంబ్లీ సమావేశాలలో రైతాంగం సమస్యల గురించి ఎమ్మెల్యే, నల్లమిల్లి నేడు ప్రస్తావించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.
గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు అంశం ఒక ప్రసహనంగా మారి రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. సి ఎమ్ ఆర్ క్రింద కొనుగోలు చేసిన ధాన్యానికి 6 నుండి 8 మాసాల వరకు రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు
ఈ నేపద్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకుని నాటి ప్రభుత్వం బకాయి పెట్టిన రూ 1674 కోట్ల బకాయిలను రెండు దఫాలుగా చెల్లించడం ఆనందదాయకం, మొన్నటి పంటకు వెనువెంటనే 48 గంటలు అన్నారు గానీ 24 గంటలలోనే కూటమి ప్రభుత్వం డబ్బు చెల్లించడం చూసాం
2024 ఖరీప్ కాలానికి 5.5 లక్షల మంది రైతులకు రూ 7,564 కోట్లు 48 గంటల లోపే చెల్లించడం చూసాం, ఇక్కడ అనేకమంది పెద్దలు చెప్పినట్లుగా ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచాల్సి ఉంది, ధాన్యం కొనుగోలులో విధించిన జిల్లాల పరిధిలో కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది, ఉదాహరణకు అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం కాకినాడలో ఉంది కానీ ఆమండల రైతాంగానికి కాకినాడ జిల్లా రైస్ మిల్స్ చాలా దూరంలో ఉన్నాయి. ఆరైతాంగానికి బిక్కవోలు మండలం రైస్ మిల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. జిల్లా పరిధి వెసులుబాటు ఇచ్చి వారికి బిక్కవోలులో అమ్ముకునే అవకాశం కల్పిస్తే ఆ రైతులకు సౌకర్యంగా ఉంటుంది.
ఈ విషయాన్ని నేను గతంలోనే మంత్రి, దృష్టికి తీసుకువెళ్ళినా ఆచరణ సాధ్యం కాలేదు, రైతుల సౌకర్యం దృష్ట్యా, ప్రయోజనాల దృష్ట్యా జిల్లా పరిధిలో కాకుండా రైతులకు ఎక్కడ అమ్ముకోవడానికి సౌకర్యం ఉంటుందో దానికి వెసులుబాటు కల్పించమని సభ ద్వారా మంత్రికి విన్నవించుకుంటున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
