Two Vehicles Seized :రెండు వాహనాలు స్వాధీనం – కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాదవ్

TRINETHRAM NEWS

Trinethram News : కాకినాడ జిల్లా,
జగ్గంపేట పోలీస్ స్టేషన్,
ది. 05.03.2025.

కాకినాడ జిల్లా, జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో
8 మంది అరెస్టు,
భారీ ఎత్తున 492 కేజీల గంజాయి,
రు.2,78,000 నగదు,
రెండు వాహనాలు స్వాధీనం – కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాదవ్, ఐపీస్.

492 కేజిల గంజాయితో కాకినాడ జిల్లా(1), ఏ ఎస్ ఆర్ జిల్లా(3), తమిళనాడు(2) మరియు కర్ణాటక(2) కు చెందిన మొత్తం 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీస్ లు.

ఒక మహీంద్రా టీయూవి కార్, ఒక మోటార్ సైకిల్, క్యాష్ 2,78,000/- మరియు ఏడు సెల్ ఫోన్ లు మొత్తం 30,52,000/- విలువ గల గంజాయి స్వాదీనం

ఏజెన్సీ ప్రాంతం నుండి జగ్గంపేట కు మరియు జగ్గంపేట నుండి తమిళనాడు, కర్ణాటక రాష్టలకు గంజాయి తరలిస్తుండగా కాకినాడ జిల్లా ఎస్పి జి . బిందు మాధవ్, ఐపీస్,వార్కి వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట (ఎమ్ ), జగన్నన్న కాలనీ లో ఒక ఇంటిలో స్వాదినం చేసుకున్న జగ్గంపేట పోలీసులు.

కాకినాడ జిల్లా ఎస్పి జి . బిందు మాధవ్, ఐపీస్ వారు నేషనల్ హైవే మీద గంజాయి రవాణా మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ది.వి. ది.వి 04.03.2025 నా ఎస్పి, జగ్గంపేట పోలీస్ లకు సమాచారం ఇచ్చి రైడ్ చేయమని ఆదేశాలు జారీ చేసినందున జగ్గంపేట (v) (M) , జగన్నన్న కాలనీ లో రైడ్ చేసి ఒక మహీంద్రా కారు AP31DD4032 లో 7 బస్తాలు గంజాయి, ఇంటిలో 10 బస్తాలు గంజాయి, క్యాష్ 2,78,000, ఏడు సెల్ ఫోన్ లు, ఒక హీరో హోండా మోటార్ సైకిల్ AP39EG7230 స్వాదీనము చేసుకొని 8 ముద్దాయిలను అరెస్ట్ చేయడము జరిగింది.


ఈ కేసు లో ఏ1   ఏజెన్సీ ప్రాంత సప్లయర్స్ కు మరియు ఇతర రాష్ట్రాల కనుగోలు దారులకు మద్య వర్తిగా/ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ కేసు లో మరో ఇద్దరు తమిళనాడు కు చెందిన మురుగన్  మరియు కర్ణాటక కు చెందిన సర్వన్ అనే వ్యక్తుల ను అరెస్ట్ చేయవలసి ఉన్నది. ఏ1 కు రెండు మరియు ఏ2 కి ఒక పాత కేసులు కలవు.   

ఈ కేసు ను పట్టుకోవడం లో చురుకుగా వ్యవహరించిన జగ్గంపేట సీఐ వై ఆర్ కె , జగ్గంపేట ఎస్ఐ టీ రఘునధ రావు, గండేపల్లి ఎస్ఐ శివ నాగ బాబు, కిర్లంపూడి ఎస్ఐ జి . సతీష్ మరియు, – సలీం (గండేపల్లి), పిసి – పి . కృపారావు(గండేపల్లి),, పిసి -బాలాజీ(గండేపల్లి), పిసి -సత్యనారాయణ (జగ్గంపేట), హోం గార్డ్ లు అనీల్, వీరబాబు, సోమరాజు, సూరిబాబు లను ఉన్నత అధికారులు అభినందించారు.

పెద్దాపురం ఎస్ డి పి ఓ, శ్రీహరి రాజు గారి ఆధ్వర్యంలో సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ కేసు ను దర్యాప్తు చేస్తున్నారు. మరియు ఈ కేసు లో ఫైనాన్సర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది.

ముద్దాయిలు గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి స్వాదీనము చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇళ్లను అక్రమ ఆసాంఘిక కార్య క్రమాలకు అద్దెకు ఇచ్చినచో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొనబడును.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two vehicles seized

You cannot copy content of this page

Scroll to Top