-బొమ్మూరు కలెక్టరేట్ వద్ద కార్మికుల ధర్నా
రాజమహేంద్రవరం : గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కే మస్తాన్ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టరేట్ వద్ద ఇసుక కార్మికులతో బుధవారం ధర్నా నిర్వహించడం జరిగింది.
అనంతరం కలెక్టర్ ప్రశాంతికి వినతి పత్రం అందచేసారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గతంలో పడవలలో కార్మికులు ఇసుక తీసి గట్టుకు తరలించేవారని, ఈ మధ్యకాలంలో కొంతమంది దళారులు ఎటువంటి అనుమతులు లేకుండా డ్రెడ్జింగ్ పడవలతో గోదావరిలో యంత్రాలతో ఇసుక తీస్తున్నారని, దీని వలన పదివేల మంది ఇసుక తీసే కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేసారు.
అంతేకాకుండా యంత్రాలతో ఇసుక తీయడం వల్ల గోదావరిలో 340 అడుగు లోతు గోతులు ఏర్పడుతున్నాయని, భవిష్యత్తులో గోదావరిలో నిర్మించిన కట్టడాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. చట్ట వ్యతిరేకంగా యంత్రాలతో ఇసుక తరలిస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు నిషేధించాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, కృష్ణ, సత్తిబాబు, దుర్గా, వెంకటలక్ష్మి, వీర వేణి, నాగమణి, డేవిడ్ రాజు, విజ్జేశ్వరం, ధవలేశ్వరం తదితర గ్రామాల ఇసుక తీసే కార్మికులు 15 మంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


