
_వేల్పుల కుమారస్వామి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ జీ.ఓ.లు విడుదల చేయాలని, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్జి -1 లోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సెక్షన్లు, ఆర్.ఎఫ్.సి.ఎల్.
భవన నిర్మాణ కార్మికులు, ప్రైవేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్మికుల్లో సంతకాలు సేకరణ చేసి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ గత బిఆరెస్ ప్రభుత్వం కనీస వేతనాల జీ.ఓ.లు సవరించకుండా కార్మికులకు తీవ్ర నష్టం చేసిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కాంట్రాక్టు కార్మికులకు నెల రోజుల్లో కనీస వేతనాలు పెంచుతామని, హైపవర్ వేతనాలు ఇప్పిస్తామని ఉప ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు.
కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది అయినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు,వేతనాలు పెరగలేదని అన్నారు.కనీస వేతనాల జీ.ఓ. సవరించలేదని అన్నారు.ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని జీతాలు మాత్రం పెరగలేదని అన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఆలోచించడం లేదని అన్నారు. వారికి సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేసి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
అదే విధంగా భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ సమస్యలు పరిష్కరించాలని,జిల్లాలో కార్మిక శాఖ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఆర్.ఎఫ్.సి.ఎల్.కాంట్రాక్టు కార్మికుల కు కనీస వేతనాలతో పాటు కనీస సౌకర్యాలు లేవని అదేవిధంగా కార్మికులపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పదుతున్నరని అన్నారు. అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి 6న అన్నీ జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రేపు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నా లో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపివ్వడం జరిగింది ఈకార్యక్రమంలో ఉపేందర్,శివ కుమార్,హేమలత, సంగీత, కల్యాణి, ఒదమ్మ, పద్మ, స్వరూప, అనిత, జ్యోతి, స్వప్న, లోకేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
