Corporator Jupalli Birthday : ఘనంగా కార్పొరేటర్ జూపల్లి జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

కూకట్‌పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 2 : కూకట్‌ పల్లి 121 డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆర్.సతీష్ అరోరా, దీనబంధు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.మహేందర్ నాయక్ ప్రభృతులు జూపల్లిని నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మహేందర్ నాయక్ మాట్లాడుతూ, కార్పొరేటర్ జూపల్లి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ డివిజన్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కితాబిచ్చారు. అంతకుముందు కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కె.నవీన్ కుమార్ ప్రభృతులతోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు జూపల్లిని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Jupalli birthday

You cannot copy content of this page

Scroll to Top