
Trinethram News : Telangana : Mar 01, 2025,రేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు వ్యక్తిగత సాధనకు, జీవిత పరమార్థాన్ని గ్రహించేందుకు, క్రమశిక్షణ పెంపొందించేందుకు సహాయపడతాయని అన్నారు. నెల రోజుల పాటు కొనసాగే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ఆకాంక్షలు దేవుని దీవెనలతో సాకారం కావాలని కేసీఆర్ ప్రార్థించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
