TRINETHRAM NEWS

రైతు పండించిన పంట నేరుగా రైతు బజార్ కె వెళ్లేలా, కూటమి ప్రభుత్వ కృషి చేస్తుంది, మండపేట ఎమ్మెల్యే, వేగుళ్ళ జోగేశ్వరరావు

Trinethram News : ప్రతీ రైతు పండించిన పంటను ఎటువంటి దళారి వ్యవస్థ లేకుండా రైతు బజార్లకు వచ్చి విక్రయించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, ఎమెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట రైతు బజార్ ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రైతు బజార్ లో స్టాల్స్ పరిశీలించి, కూరగాయల ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏమైన సమస్యలు ఉంటే తెలపాలని అక్కడి రైతులను అడుగగా వారు ఏ సమస్యలు లేవని ఎమ్మెల్యే కు చెప్పారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జొన్నపల్లి సూర్యారావు, పిల్లా గణపతి, వంక మణి, గడి రాంబాబు, ఎస్టేట్ ఆఫీసర్ బోళ్ళ సతీష్, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla