TRINETHRAM NEWS

సర్జరీ విజయవంతం చేసిన వైద్య బృందానికి అభినందనలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఫిబ్రవరి – 01: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు 31 సంవత్సరాల వయస్సు గల మహిళా 6 వారాల 2 రోజుల గర్భం ఫల్లోపియన్ ట్యూబ్ లో ఏర్పడి , అది పగిలి తీవ్రమైన రక్త స్రావం కడుపు లో జరుగగా , సదరు పేషెంట్ ఈ రోజు ప్రైవేటు హాస్పిటల్ సంప్రదించగా స్కానింగ్ చేసి, హయ్యర్ సెంటర్ కు రీఫెర్ చేశారు
ఆ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించిన వెంటనే, గవర్నమెంట్ హాస్పిటల్ లో డ్యూటీ లోఉన్న స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ లావణ్య, మత్తు స్పెషలిస్ట్ డాక్టర్.శౌరయ్య, ఆర్.ఎం.ఓ డాక్టర్ రవీందర్ , ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ వంటి సీనియర్ వైద్యుల సమక్షంలో గంట వ్యవదిలో అవసరమైన రక్త పరిక్షలు నిర్వహించి కడుపు లోపల కల్లెక్ట్ ఐన సుమారుగా ఒక లీటర్ రక్తాన్ని తీసేసి బ్లీడింగ్ పాయింట్ ని కంట్రోల్ చేసి ఆపరేషన్ విజయవంతగా చేయడం జరిగింది.
ఇట్టి సర్జరీ వల్ల మహిళా ప్రాణం కాపడగలి ఈ శస్త్ర చికిత్సను విజయవంతగా నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని, ఆసుపత్రి సిబ్బందిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఆసుపత్రి లో మాతా శిశు ఆసుపత్రిలో వివిధ రకాల స్పెషలిస్ట్ సేవలు, శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని, అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector Koya Shri Harsha