విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి : కేయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేష్‌లాల్
హనుమకొండ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేష్‌లాల్ అన్నారు. నగరంలోని దేశాయిపేటరోడ్‌లో గల ఒయాసిస్ పబ్లిక్ స్కూల్‌లో శనివారం సోషల్ ఫెయిర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ సురేష్‌లాల్ ప్రారంభించి మాట్లాడారు. సామాజిక స్పృహ, సమాజంలో మార్పులపై చర్చించడానికి సోషల్ ఫెయిర్ ప్రదర్శనలు మంచి వేదికలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సంస్కృతులు సమాజాల ఏకీకరణను సులభతరం చేశాయని తెలిపారు. ప్రపంచీకరణ ఆర్థిక వృద్ధి ఉద్యోగకల్పన మెరుగైన జీవన ప్రమాణాలు వంటి అనేక ప్రయోజనాలను తెచ్చినప్పటికీ ఆదాయ అసమానత, ఉద్యోగ స్థానభ్రంశం సాంస్కృతిక సజాతీయత వంటి సవాళ్లను కూడా సృష్టించిందని, అందువల్ల విద్యార్థులు, ప్రజలు సామాజిక విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు.
ఒయాసిన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జన్ను పరంజ్యోతి మాట్లాడుతూ దేశంలో జనాభా పెరుగుదల యొక్క అనర్థాలను, పట్టణీకరణ, ప్రపంచీకరణ సమాజంలోని మీడియా పాత్ర సామాజిక సమస్యలు, ప్రపంచ యుద్ధాలు, ప్రజల మానసిక, శారీరకంగా శక్తి సమర్ధత వ్యవసాయ రంగ అభివృద్ధి విషయాలపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సోషల్ ఫెయిర్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ట్రస్మా ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు, హడుప్సా ప్రధాన కార్యదర్శి టి.బుచ్చిబాబు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక, సాంకేతిక అంశాలపై విద్యార్థులు శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App