జూన్ 27, 2026

WhatsApp Image 2025 02 01 at 18.47.30

TRINETHRAM NEWS

ఫారెన్ స్ట్రీట్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం, నేరాల నియంత్రణ కు సిసి కెమెరాల ఏర్పాటు చేసుకోవాలి

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫారెన్ స్ట్రీట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ,అదేశాల మేరకు, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడమైనది. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా 01- సీఐ, 04-ఎస్ఐ లు, 10-ఏఎస్ఐ లు, 30- మంది కానిస్టేబుళ్లు , 08- స్పెషల్ పార్టీ సిబ్బంది తో కాలనీ లో ఇండ్లలలో తనిఖీలు నిర్వహించి, సరైన ధ్రువపత్రాలు లేని 50-బైక్ లు, 06-ఆటో లు, -04 కార్ కు మొత్తం 60 వాహనాలు సిజ్ చేయడం జరిగింది. కాలనీ వాసులతో సీఐ మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , కాలనీ లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువ త్రాలను కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీ లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు
యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా మారకుండా కఠిన చర్యలు తీసికోవడం జరుగుతుంది అని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CC cameras

You cannot copy content of this page