TRINETHRAM NEWS

వేతనాల పెంపుకై సింగరేణి వ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపు

PSCWU రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అధ్యక్షులుగా ఎస్కే యాకూబ్ షావలి, ప్రధాన కార్యదర్శిగా తోకల రమేష్. 21 మందితో కార్యవర్గం ఎన్నిక

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కామ్రేడ్ చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్లో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (TUCI) రాష్ట్ర రెండవ మహాసభ జరిగింది.ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది సంఘం అధ్యక్షులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుమ్మడి నరసయ్య అధ్యక్షులుగా షేక్ యాకూబ్ షావలి (ఇల్లందు), ప్రధాన కార్యదర్శిగా తోకల రమేష్ (గోదావరిఖని), ఉపాధ్యక్షులుగా ఆర్ మధుసూదన్ రెడ్డి (మణుగూరు), సహాయ కార్యదర్శిగా పెద్ద బోయిన సతీష్ (కొత్తగూడెం), కోశాధికారిగా సివై పుల్లయ్య(సత్తుపల్లి) ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పాయం వెంకన్న (ఇల్లందు) శరత్ (సత్తుపల్లి) కార్యవర్గ సభ్యులుగా కొయ్యడ శంకర్, సంజీవరెడ్డి, పులిపాక రాజేందర్, మాట్ల సమ్మయ్య, దేవి, జానీ, అశోక్, రాజశేఖర్, మరియా, ఎం చంద్రశేఖర్, శంకర్, కొత్తపల్లిరఘు, సంజీవ్ లతోపాటు మొత్తం 21 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. వేతనాల పెంపుదలకై సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. సింగరేణిలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. గైర్హాజరు పేరుతో విధిస్తున్న పెనాల్టీలను వెంటనే రద్దు చేయాలని, ప్రతి నెల 7వ తారీకు వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, నర్సరీ సులభ్ కోల్డ్ ట్రాన్స్పోర్ట్ లాంటి తదితర సెక్షన్లకు సీఎం పిఎఫ్ కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వేతనాల పెంపదలకై తదితర సమస్యల పరిష్కారానికి సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Election of executive committee