కేంద్రప్రభుత్వం ఈరోజు ప్రవేశబెట్టిన బడ్జెట్ రైతులకు ఉపయోగకరమైన బడ్జెట్ ఎమ్మెల్యే,నల్లమిల్లి
కేెంద్రబడ్జెట్ గురించి మీడియాతో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ…
Trinethram News : ఈరోజు కేంద్రప్రభుత్వం ప్రవేశబెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్.. ముఖ్యంగా రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది, … గత పది సంవత్సరాలుగా దేశంలో అమలు చేస్తున్న సంస్కరణల పలితం ఈరోజు కనబడుతుంది.
సామాన్యులకు ఇన్ కం టాక్స్ లో అనేక రాయితీలివ్వడం, పప్పు ధాన్యాలను ప్రమోట్ చేయడం కోసం స్వయం సమృద్ది పధకం ప్రవేశ పెట్టడం, పళ్ళు కూరగాయలను పండించేవారికి పెసిలిటీస్ కల్పించడం, ప్రత్తికి జాతీయమిషన్ ని ఏర్పాటు చేయడం తద్వారా రైతులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని మూడు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచడం ద్వారా 7.7 కోట్ల మంది రైతులకు లబ్దిని కలిగించింది.
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇప్పటికే బడ్జెట్ సంబంధం లేకుండా 3 లక్షల కోట్లు రూపాయిలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు బడ్జెట్ లో రెగ్యులరైజ్ చేయడం జరిగింది.
గడచిన ఏడునెలలుగా కేంద్రప్రభుత్వం ఏపికి చేకూర్చుతున్న ప్రయోజనాలను బడ్జెట్ లో పొందుపరచడం ద్వారా దానికి స్వయంప్రతిపత్తి కల్పించడం జరిగింది.
ప్రజారంజక బడ్జెట్ ని అందించిన కేంద్రప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోడి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App