జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 20.14.47

TRINETHRAM NEWS

దయగల హృదయాన్ని చాటుకున్న “జనసేన పార్టీ” నాయకులు.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా కొయ్యూరు మండలం, రాజేంద్రపాలెం కి చెందిన, గోకిరి శ్యాంప్రకాశ్ గత మూడేళ్లు గా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో జనసేన పార్టీ నాయకులు, టిడిపి పార్టీ నుండి, ఒక యువనేత కలిసి హాస్పిటల్ కి చూపించండజరిగింది. ఎంతో మంది దాతలు ఆ రోజున సహాయం చేశారు.

ఆ కృషి ఫలితం ఆయనకి ఒక అయిదారు, కిమో తెరిఫియ కూడా జరపడం జరిగింది. వాళ్ళ చిన్నాన్న శ్యామ్ ప్రకాష్ బాగోగులు చూసినప్పటికీ, విధిరాత ఏమిటంటే బాగా చూసుకుంటున్న తరుణంలో వాళ్ళ నాన్నమ్మ క్యాన్సర్ తో బాధపడుతూ అనారోగ్యానికి గురి కావడం వల్ల ఇద్దరు బాగోగులు చూసుకోలేని వాళ్ళచిన్నాన్న ఎంతో నరకయాతన అనుభవించాడు. ఆ రకంగా వాళ్ళ నానమ్మ మరణించినప్పుడు ఎంతో శోభకు గురైనటువంటి, ఆ కుటుంబం, శ్యామును ఒక పక్క హాస్పిటల్ కి చూపిస్తూనే మరోపక్క ఆర్థిక భారం కొనసాగలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ఆ రకంగా శ్యాంప్రకాష్ కీమో తెరిఫియా జరుగుతుండగానే డబ్బులు కొరత ఉండడంతో గత ఏడాది నుండి కీమోతెరపియా చేయించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ కష్టాన్ని చూడలేక నేడు జనసేన పార్టీ కొయ్యూరు మండలం నుండి అతనికి ఆర్థిక సహాయం అందజేయడానికి నిశ్చయించుకొని, కొద్ది మొత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగునే మనసున్న దాతలు ఎవరైనా ఉంటే విరి,విరిగా విరాళాలు అందించి ఆ బాలుడిని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ విషయాన్ని , పాడేరు మరియు అరకు నియోజకవర్గాల ఇంచార్జ్ వంపూరు గంగులయ్య దృష్టికి, తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తామని, కొయ్యూరు మండల జనసేన నాయకులు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, గూడెం లక్ష్మణ్, బూత్ కమిటీ చైర్మన్ సాగిన బుజ్జిబాబు, కాబోయే మండల ప్రధాన కార్యదర్శి. గూడెపుశేషుబాబు , జిపి స్కూల్ చైర్మన్ పీటా సుధీర్ బాబు, కాబోయే మండల ఉపాధ్యక్షుడు, పూర్రా రాజేష్, మండల ప్రధా కార్యకర్త నాగేంద్రబాబు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రాఘవ రాజు, బంగారు బాబు అదేవిధంగా రాజేంద్రపాలెం యూత్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page